పటాన్‌చేరు నియోజకవర్గంలోని కొల్లూరు కేసీఆర్ నగర్ డబుల్ బెడ్‌రూమ్ కాలనీవాసుల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే “హరీశ్‌రావు” పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల ఆదరణపై ఆనందం వ్యక్తం చేశారు. “నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశానికి వచ్చినప్పుడు ప్రజలు పెద్దగా హాజరుకాలేదు, కానీ మన మీటింగ్‌కి మాత్రం జనసంద్రం ఉప్పొంగింది.

హరీశ్‌రావు మాట్లాడుతూ, “కేసీఆర్ ప్రజలకు కలలో కూడా కలగనని ఇళ్లను కట్టించి ఇచ్చాడు. ఆ ఇళ్లను చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ప్రజలను మోసం చేస్తున్నారు. రూ.3 వేల ఓటుకు ఇస్తామని చెబుతున్నారు, కానీ మహాలక్ష్మి స్కీమ్, తులం బంగారం, స్కూటీ ఏమీ అమలు చేయలేదు,” అన్నారు.
అలాగే రేవంత్ రెడ్డి పాలనను తీవ్రంగా విమర్శిస్తూ, “ఆయన ధరలు పెంచి, కమీషన్లు దండుకున్నాడు. అభివృద్ధి కనబడకపోతే అంధుడు లేదా పిచ్చోడు అయిన ఉండాలి.

ALSO READ:The Thaandavam: అఖండ 2 తాజా అప్‌డేట్ “తాండవం” సాంగ్ ప్రోమో
కేసీఆర్ ముస్లింలు, హిందువులు అన్న తేడా లేకుండా అందరికీ సహాయం చేశాడు,” అని అన్నారు.చివరగా ఆయన ప్రజలను ఉద్దేశించి, “మీ అందరికీ ఇండ్లు ఇచ్చిన కేసీఆర్‌ను మర్చిపోవద్దు.
నవంబర్ 11న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటేయండి. ఈ ఎన్నికలు ప్రజల తీర్పు – కేసీఆర్ పక్షంలో ఉండాలి,” అని పిలుపునిచ్చారు.
