HYD:జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రజలు వచ్చే మూడేళ్లపాటు నరకయాతన అనుభవించాల్సి వస్తుందని మాజీ మంత్రి “హరీశ్ రావు” తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “ఇది వికాసం కోసం జరగుతున్న ఎన్నిక కాదు, విధ్వంసం కోసం జరుగుతున్న ఎన్నిక.
ప్రజలు ఏది కావాలో ఇప్పుడు తేల్చుకోవాలి,” అని ఆయన స్పష్టం చేశారు.హరీశ్ రావు మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయింది.
నాలుగు కోట్ల ప్రజలు కాదు, నలుగురు బ్రదర్స్ మాత్రమే సంతోషంగా ఉన్నారు. గ్యారంటీలు అన్నీ ఎగవేసిన ప్రభుత్వం ఇది,” అంటూ మండిపడ్డారు.
ALSO READ:వివాహ వేడుకల్లో దేశభక్తి జల్లు – వందేమాతరతో ప్రారంభమైన పెళ్లి వేడుక
ఆయన మాట్లాడుతూ “సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే రేషన్ కార్డులు ఆపేస్తామని ప్రజలను బెదిరిస్తున్నారు,” అని ఆరోపించారు.
అంతేకాక, “కంటోన్మెంట్‌లో 6 వేల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఎక్కడ? ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ గెలిచింది కానీ రెండు సంవత్సరాలుగా ఆ హామీలు నెరవేర్చలేదు. అజహరుద్దీన్‌కి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు?” అని ప్రశ్నించారు.
సినీ హీరోలను జైలుకు పంపి, ఇప్పుడు సినీ కార్మికులకు వంగి నమస్కరించడం ద్వంద్వ వైఖరి అని ఎద్దేవా చేశారు. “పీజేఆర్‌పై ప్రేమ ఉందంటే 2023లో ఆయన కుమారుడికి టికెట్ ఎందుకు ఇవ్వలేదు?” అని హరీశ్ రావు నిలదీశారు.
