వివాహ వేడుకల్లో దేశభక్తి జల్లు – వందేమాతరతో ప్రారంభమైన పెళ్లి వేడుక

వరంగల్‌లో వందేమాతర గీతంతో ప్రారంభమైన వివాహ వేడుక

వరంగల్: జీవితంలో ఒక్కసారి జరిగే వివాహ వేడుకలోనూ దేశభక్తి ప్రతిధ్వనించింది. వరంగల్ నగరంలోని రంగశాయి పేటకు చెందిన కానిస్టేబుల్‌ గోగికార్‌ శ్రీకాంత్‌, లక్ష్మిసాయి ల వివాహం శుక్రవారం ఘనంగా జరిగింది. అయితే ఈ పెళ్లి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

వివాహ వేడుకలో భాగంగా ‘వందేమాతరం’ గీతం రచనకు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు పెళ్లి మండపంలోనే సామూహిక వందేమాతర గీతాలాపన నిర్వహించారు. వధూవరులు, బంధుమిత్రులు, అతిథులు అందరూ కలసి దేశభక్తితో గళం కలిపారు.

వరంగల్‌లో వందేమాతర గీతంతో ప్రారంభమైన వివాహ వేడుక

ప్రతి పౌరుడి హక్కుల పట్ల అవగాహనతో పాటు దేశానికి విధులు, రాజ్యాంగ సూత్రాలు పాటించాలనే భావనను  పెంపొందించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం,” అని పెళ్లి పెద్దలు తెలిపారు.

ALSO READ:ప్రమాదాల నివారణకు ఆర్టీసీ కొత్త చర్యలు – డ్రైవర్లకు సిమ్యులేటర్‌ శిక్షణ ప్రారంభం

దేశభక్తితో నిండిన ఈ వినూత్న వివాహ వేడుకను పలువురు అధికారులు, ప్రముఖులు, స్థానికులు అభినందించారు. వందేమాతరతో ప్రారంభమైన ఈ పెళ్లి, అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *