వరంగల్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ సూరీ గ్యాంగ్‌ అరెస్ట్‌

వరంగల్‌లో మోస్ట్ వాంటెడ్‌ సూరీ గ్యాంగ్‌ అరెస్ట్‌

WARANGAL:హైదరాబాద్‌ నగర బహిష్కరణకు గురైన మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ దాసరి సురేందర్‌ అలియాస్‌ సూరీ  మరోసారి పోలీసుల వలలో చిక్కాడు. వరంగల్‌ పోలీసులు సూరీతో పాటు అతని గ్యాంగ్‌లో ఉన్న  ఎనిమిది మందిని అరెస్ట్‌ చేశారు. 

శుక్రవారం హనుమకొండలోని  వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో ఈస్ట్‌ జోన్‌ డీసీపీ అంకిత్‌ కుమార్‌  మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం — సూరీ, హైదరాబాద్‌ పోలీసులు నగర బహిష్కరణ చేసిన తర్వాత వరంగల్‌ నగరం భీమారం ప్రాంతంలో తలదాచుకున్నాడు.అక్కడ ఏడుగురు సహచరులతో కలిసి ముఠా ఏర్పాటు చేసి నేరాలకు పాల్పడుతున్నాడు.

అక్టోబర్‌ 18న రాత్రి  శాయం పేట మండలం మందారిపేట హైవే రోడ్డుపై లారీ డ్రైవర్‌ను వెపన్‌తో బెదిరించి, రెండు బైకుల్లో పెట్రోల్‌ దోచుకున్నాడు.

లారీ డ్రైవర్‌ ఫిర్యాదు మేరకు శాయం పేట పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది, టాస్క్‌ఫోర్స్‌ బృందం సంయుక్తంగా దర్యాప్తు చేసి సూరీ గ్యాంగ్‌ను పట్టుకున్నారు.

ALSO READ:మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధికి గండిపేట, రాజేంద్రనగర్‌, శంషాబాద్‌ భూముల కేటాయింపు


పోలీసులు ముఠా వద్ద నుండి  రెండు పిస్టల్స్‌, ఒక కత్తి, రెండు బైకులు, ఎనిమిది మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన వారిలో నలుగురు విద్యార్థులుగా తేలారు.

వీరిలో ములుగు జిల్లా నివాసితులు సంరాజ్‌, సంరాజ్‌ క్రాంత్‌, ఏనుగుల క్రాంత్‌, హైదరాబాద్‌కి చెందిన ఆదిత్య ఠాకూర్‌, హసన్‌పర్తి నివాసి బీటెక్‌ విద్యార్థి నమిడ్ల శివమణి, అలాగే భీమారం ప్రాంతానికి చెందిన డాగ్‌ ఫార్మ్‌ ట్రాన్స్‌పోర్టర్‌ రౌతు శివ వైభవ్  ఉన్నారు.

పోలీసులు ఈ ముఠా ఇతర నేరాల్లో కూడా పాల్గొన్న అవకాశాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *