వన్డే ప్రపంచకప్‌లో భారత మహిళా క్రికెట్ జట్టులో ప్రాతినిధ్యం వహించి తన ప్రతిభను చాటిన తెలుగు తేజం “శ్రీచరణి”కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘన గౌరవం తెలిపింది.
ముఖ్యమంత్రి “చంద్రబాబు నాయుడు” నేతృత్వంలోని ప్రభుత్వం ఆమెకు రూ.2.5 కోట్ల నగదు పురస్కారం, “గ్రూప్–1 స్థాయి ఉద్యోగం”, అలాగే “కడపలో ఇంటి స్థలం”ను బహుమతిగా ప్రకటించింది.
ఈ సందర్భంగా శ్రీచరణి ఈరోజు ఉదయం సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌లను కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, “అందరి ప్రేమ, అభిమానం చూసి చాలా ఆనందంగా ఉంది.

నా కుటుంబం ఎప్పుడూ నన్ను ప్రోత్సహించింది. ముఖ్యంగా మా మామగారు నన్ను క్రికెట్ ఆడమని ప్రోత్సహించేవారు. నేను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌లో శిక్షణ తీసుకున్నాను,” అని తెలిపారు.
Also Read:బీజేపీ, బీఆర్‌ఎస్ దుష్ప్రచారాలపై మండిపడ్డ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్
తన క్రీడా ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైందని చెప్పిన శ్రీచరణి, “ఇది నా ప్రయాణంలో మొదటి అడుగు మాత్రమే.. ఇంకా చాలా దూరం వెళ్లాలి. ఇటీవల ప్రధాని మోదీని కలిసినప్పుడు ఆయన భవిష్యత్ లక్ష్యాలపై విలువైన సలహాలు ఇచ్చారు” అని తెలిపారు.
