జగిత్యాల జిల్లాలో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. సాధారణంగా 50 మంది ప్రయాణికుల కోసం నడిపే ఆర్టీసీ బస్సులో అధికారులు 170 మందిని ఎక్కించడంతో బస్సు ఓవర్‌లోడైంది. దాంతో మధ్య మార్గంలోనే బస్సు వెనుక చక్రాలు ఊడిపోయాయి.
బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, బస్సు అధిక లోడుతో ప్రయాణించడమే కాకుండా రోడ్డుపై వేగం కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు.
ALSO READ:ఉచిత ఇసుక పథకం దారితప్పింది..
ఈ ఘటనతో ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రజా రవాణా సంస్థ అయిన ఆర్టీసీ సురక్షిత ప్రయాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. అధికారులు ఇలాంటి నిర్లక్ష్యాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
