మహబూబాబాద్ జిల్లా మరిపెడలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈఓ.రైతు బీమా మంజూరు కోసం లంచం డిమాండ్ చేసిన ఈ ఘటన గురువారం మరిపెడ మున్సిపల్ పరిధిలో చోటుచేసుకుంది.
ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం, మరిపెడ మండలంలోని అనేపురం గ్రామానికి చెందిన రైతు బిక్కు అక్టోబర్ 14న మృతి చెందగా, ఆయన కుమారుడు రైతు బీమా నిమిత్తం దరఖాస్తు చేసుకున్నాడు.
అయితే అనేపురం క్లస్టర్ ఏఈఓ గాడిపెళ్లి సందీప్ బీమా పత్రాలు ఆన్లైన్‌లో పంపించాలంటే రూ.20 వేల లంచం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.
ALSO READ:Womens World Cup విజేతలతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భేటీ
రైతు కుమారుడు డబ్బులు ఇవ్వకుండా ఏసీబీ అధికారులను సంప్రదించడంతో గురువారం మరిపెడలోని జేజే బార్ అండ్ రెస్టారెంట్ ఎదుట రూ.10 వేల లంచం స్వీకరిస్తుండగా ఏఈఓ సందీప్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
నిందితుడిని శుక్రవారం వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు డీఎస్పీ సాంబయ్య తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ఇన్స్పెక్టర్లు ఎల్.రాజు, శేఖర్ మరియు ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.
