రామచంద్రాపురం అమీన్‌పూర్‌లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. చీమల భయంతో ఒక యువతి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని నవ్య కాలనీలో నివసిస్తున్న మనీషా (25) చీరతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది.
2022లో మనీషా, చిందం శ్రీకాంత్ (35)ను వివాహం చేసుకుంది. వీరికి మూడు సంవత్సరాల పాప అనికా ఉంది. మంచిర్యాల జిల్లాకు చెందిన ఈ దంపతులు ఉద్యోగ కారణంగా గత రెండున్నర సంవత్సరాలుగా అమీన్‌పూర్‌లో నివసిస్తున్నారు.
ALSO READ:ఇమ్రాన్ ఖాన్ ఘాటు విమర్శలు – “పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ క్రూర నియంత
మనీషాకు చిన్నప్పటి నుంచీ చీమల పట్ల తీవ్రమైన భయం *మైర్మెకోఫోబియా* ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం ఉదయం శ్రీకాంత్ ఆఫీసుకు వెళ్లగా, సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపు లోపల నుంచి మూసి ఉండటాన్ని గమనించాడు. స్థానికుల సహాయంతో తలుపు పగులగొట్టి చూడగా, మనీషా ఉరి వేసుకుని మృతదేహంగా కనిపించింది.
పక్కనే లభించిన సూసైడ్ నోట్‌లో “చీమల భయం భరించలేక చనిపోతున్నాను. మా కూతురు అనికాను జాగ్రత్తగా చూసుకో” అని రాసి ఉంది. ఈ ఘటనతో నవ్య కాలనీ ప్రజలు షాక్‌కు గురయ్యారు.
భర్త శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
