HYD:జోడో యాత్ర ద్వారా దేశంలోని మైనార్టీలకు రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు బుధవారం ఆయనను కలిశారు.
తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లిన ప్రతినిధులకు రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించిన పాస్టర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
సీఎం మాట్లాడుతూ, “భారత రాష్ట్ర సమితిని కేసీఆర్ భాజపాకు తాకట్టుపెట్టారు.జూబ్లీహిల్స్‌లో మైనార్టీలను మభ్యపెట్టేందుకు కుట్ర జరుగుతోంది. కాళేశ్వరం కేసు సీబీఐకి వెళ్లి మూడు నెలలు అయినా స్పందన లేదు.
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదు. భాజపా, బీఆర్ఎస్ మధ్య ఒప్పందం లేకుంటే ఎందుకు అనుమతివ్వరు?”అని ప్రశ్నించారు.
రేవంత్‌రెడ్డి మరింతగా మాట్లాడుతూ, “భాజపాలో బీఆర్ఎస్ విలీనం అయ్యే పరిస్థితి ఉంది. కవిత స్వయంగా గతంలోనే ఈ విషయం వెల్లడించారు. జూబ్లీహిల్స్‌ను ఈ రాజకీయ కుమ్మక్కు ప్రయోగశాలగా మార్చారు” అని తీవ్ర విమర్శలు చేశారు.
