భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన వేళ, గతాన్ని గుర్తు చేసుకుంటూ ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ విజయానికి వెనుక ఎన్నో కష్టాలు, సవాళ్లు, త్యాగాలు దాగి ఉన్నాయి. ఒకప్పుడు మహిళా క్రికెట్ అంటే పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయిన రోజుల్లో, కొంతమంది మాత్రమే వారికి అండగా నిలబడ్డారు. వారిలో నటి, వ్యాఖ్యాత, ఫ్యాషన్ డిజైనర్ మందిరా బేడీ (Mandira Bedi )ఒకరు.
మాజీ క్రికెటర్ “నూతన్ గావస్కర్”గుర్తుచేసుకుంటూ చెప్పారు – “మహిళా జట్టును విదేశీ పర్యటనకు పంపడానికి డబ్బులు లేని పరిస్థితి. ఆ సమయంలో మందిరా బేడీ తన ప్రకటన షూట్ సమయంలో అందుకున్న మొత్తం పారితోషికాన్ని ఉమెన్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు విరాళంగా ఇచ్చారు. ఆమె ఇచ్చిన డబ్బుతోనే ఇంగ్లాండ్ టూర్ కోసం విమాన టికెట్లు కొనగలిగాం అని అన్నారు.
ఇప్పుడు భారత జట్టు ప్రపంచ స్థాయిలో విజయం సాధించిన నేపథ్యంలో మందిరా బేడీ సోషల్ మీడియాలో స్పందిస్తూ, “మీరు కేవలం దేశం కోసం మాత్రమే కాదు, ప్రతి మహిళ హృదయాన్ని గెలిచారు. నేను ఒకప్పుడు మీ ధైర్యాన్ని చూశాను, ఇప్పుడు ఆ శక్తిని ప్రపంచం చూసింది,” అని పేర్కొన్నారు.
టికెట్లకు డబ్బుల్లేకపోయినా మహిళా క్రికెట్ జట్టుకు అండగా నిలిచిన మందిరా బేడీ
Mandira Bedi News
