సోషల్ మీడియాలో రాజాసాబ్ సినిమా గురించి చర్చలు జోరుగా సాగుతున్నాయి. సినిమా సంక్రాంతికి రాదని కొందరు అంటుంటే, మరోవైపు మాత్రం “ఏదైనా పరిస్థితుల్లో సంక్రాంతికే వస్తుంది” అని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
గ్రాఫిక్స్ వర్క్ ఆలస్యం కావడంతో సినిమా వాయిదా పడే అవకాశముందని టాక్ ఉన్నా, దాంతో పాట విడుదల ఎందుకు నిలిచిపోయిందనే ప్రశ్నలు ఊపందుకున్నాయి. దర్శకుడు మారుతి ప్రభాస్ పుట్టినరోజు నాడు “ఫస్ట్ వీక్‌లో ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవుతుంది” అని స్వయంగా ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఏ ప్రకటన రాకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

మారుతి ప్రస్తుతం గ్రాఫిక్స్ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ, సాంగ్ రిలీజ్ చేయడంలో దానికి సంబంధం ఏమిటని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. సినిమా విడుదల ఆలస్యమైనా, పాటలు విడుదల చేస్తే బజ్ కొనసాగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం రాజాసాబ్ ప్రమోషన్లలో వెనకబడి ఉందని చాలామంది గుర్తుచేస్తున్నారు. కనీసం ఫస్ట్ సింగిల్ అయినా రిలీజ్ చేస్తే సినిమా హైప్ మళ్లీ పెరుగుతుందని అభిమానుల ఆకాంక్ష.
