బిగ్ బాస్ నుంచి రెండు వారాల్లోనే ఎలిమినేట్ అయిన రమ్య – నోటి దురుసుతనం కారణంగా నెగెటివిటీ పెరిగింది


బిగ్ బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టిన రమ్య కేవలం రెండు వారాల్లోనే బయటకు వచ్చింది. చిట్టి పికిల్స్ రమ్యగా ప్రసిద్ధి పొందిన ఆమె హౌస్‌లో ఫిజికల్ టాస్కుల్లో మంచి సత్తా చాటినా, తన నోటి దురుసుతనం కారణంగా ప్రేక్షకుల్లో విపరీతమైన నెగెటివిటీని మూటగట్టుకుంది. ఫలితంగా ఆడియెన్స్ ఓటింగ్‌లో వెనకబడిపోవడంతో ఎలిమినేట్ అయ్యింది.

హౌస్‌లో ఉన్న టాప్ కంటెస్టెంట్లు కల్యాణ్, తనూజలను టార్గెట్ చేస్తూ రమ్య పలుమార్లు వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. దీంతో బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున కూడా ఆమె ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌస్‌లోకి వచ్చేముందే రమ్య ఒక వినియోగదారుడిపై చేసిన వాట్సాప్ మెసేజ్ వైరల్ కావడంతో సోషల్ మీడియాలో ఆమెకు నెగెటివ్ పాపులారిటీ వచ్చింది. అదే వివాదం ఆమెకు బిగ్ బాస్ అవకాశాన్ని తెచ్చినప్పటికీ, అదే నెగెటివిటీ ఆమెకు బూమరాంగ్‌గా మారింది.

రమ్య తనపై ఉన్న నెగెటివ్ ఇమేజ్‌ను బిగ్ బాస్ వేదికగా సరిదిద్దుకుంటుందనే అంచనాలు అభిమానుల్లో ఉండగా, ఆ అంచనాలకు విరుద్ధంగా ఆమె ప్రవర్తన మరింత విమర్శలకు దారితీసింది. ప్రేక్షకులు ఆమెకు ఓటింగ్‌లో పెద్దగా మద్దతు ఇవ్వకపోవడంతో కేవలం రెండు వారాల్లోనే హౌస్‌ను వీడాల్సి వచ్చింది.

ఇక పారితోషికం విషయానికి వస్తే, రమ్య బిగ్ బాస్‌లో రెండు వారాలు ఉన్నందుకు రూ.4 లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. వారానికి రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల చొప్పున బిగ్ బాస్ టీమ్ ఆమెకు చెల్లించినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *