“అందంగా లేకపోయినా ఫరవాలేదు.. అర్థం చేసుకునే వాడై ఉండాలి” – శ్రీలీల ఆసక్తికర వ్యాఖ్యలు


టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తక్కువ కాలంలోనే తెలుగుతో పాటు హిందీ చిత్ర పరిశ్రమల్లోనూ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’, రవితేజతో చేస్తున్న ‘మాస్ జాతర’ సినిమాలపై ఫోకస్ చేస్తున్నారు. సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఆమె ఇంటర్వ్యూలు, టీవీ షోలు, ఈవెంట్లలో పాల్గొంటూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో శ్రీలీల తన పెళ్లి గురించి ఓపెన్‌గా మాట్లాడారు. తాను కోరుకునే జీవిత భాగస్వామి ఎలా ఉండాలనేది వివరంగా చెప్పారు. “నా కాబోయే భర్త అందంగా లేకపోయినా ఫర్వాలేదు. కానీ అతను నాకు అర్థమయ్యే వ్యక్తి అయి ఉండాలి. నా కెరీర్‌కు మద్దతుగా ఉండాలి, నన్ను సంతోషంగా ఉంచాలి, సరదాగా ఉండాలి, అంతకన్నా ముఖ్యంగా నిజాయితీగా ఉండాలి,” అని చెప్పారు శ్రీలీల.

ఇక ఇలాంటి లక్షణాలు కలిగిన వ్యక్తి కలిసినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటానని ఆమె స్పష్టం చేశారు. తన భావోద్వేగాలను ఇలా బహిరంగంగా పంచుకోవడంతో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు “ఇలాంటి వ్యక్తి నిజంగా దొరకడం కష్టం” అంటుండగా, మరికొందరు “ఇదే నిజమైన ప్రేమకు నిర్వచనం” అంటూ శ్రీలీల అభిప్రాయాన్ని ప్రశంసిస్తున్నారు.

శ్రీలీల ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో అత్యంత బిజీగా ఉన్న నటి. వరుస ప్రాజెక్టులు చేతిలో ఉండటంతో పాటు బ్యూటీ, టాలెంట్‌తో అభిమానుల హృదయాలను గెలుచుకుంటోంది. పెళ్లి విషయంపై చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *