మేజర్ లీగ్ క్రికెట్ 2025లో టెక్సాస్ సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మరోసారి తన ఫిట్‌నెస్, ఫీల్డింగ్ నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు. 40 ఏళ్ల వయసులోనూ అతని చురుకుదనం యువ క్రికెటర్లకే సవాలుగా మారుతోంది. బ్రేస్‌వెల్ భారీ షాట్ ఆడే ప్రయత్నంలో బంతిని బౌండరీకి పంపాలని చూశాడు. కానీ అప్పటికే ఆ దిశగా దూసుకొచ్చిన డుప్లెసిస్, ఒంటిచేత్తో డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నారు. ఈ క్యాచ్ కేవలం అందమైనదేగాక, మ్యాచ్ మలుపు తిప్పింది కూడా. ఆ సమయంలో బ్రేస్‌వెల్ ప్రమాదకరంగా ఆడుతున్నాడు. డుప్లెసిస్ పట్టిన ఈ క్యాచ్ టెక్సాస్ విజయంలో కీలకంగా నిలిచింది. నెటిజన్లు ఫాఫ్‌ను మెచ్చుకుంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
వయసు కేవలం సంఖ్యే! ఫాఫ్ డుప్లెసిస్ ఒక్క చేత్తో అద్భుత క్యాచ్
 టెక్సాస్ గెలుపు రహస్యమే ఇదే
				 టెక్సాస్ గెలుపు రహస్యమే ఇదే
			
 
				
			 
				
			 
				
			