కిషన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి విమర్శలు స్పందించిన రాజాసింగ్
తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డంకి సృష్టిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. రేవంత్ రెడ్డి విమర్శలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. ఢిల్లీలో విమర్శలు చేయడం కాదని, ధైర్యం ఉంటే ఇక్కడే అడగొచ్చుగా అని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులకు, నిధులకు కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు, ముఖ్యంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గట్టిగా బదులిచ్చారు.”మీ ఆరోపణలు నిజమైతే, కేంద్రంలో మీకున్న పలుకుబడిని ఉపయోగించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి నేరుగా ఫిర్యాదు చేయొచ్చు కదా? ఆయన చర్యలు తీసుకుంటారు. అలా చేయకుండా ఢిల్లీలో విమర్శలు చేయడం, రాజకీయ లబ్ధి పొందడానికే తప్ప మరొకటి కాదు.