అంబేద్కర్ కోనసీమ జిల్లా రైతుల సమస్యలపై జిల్లా కలెక్టర్‌ను కలసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. రైతులకు ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలన్న డిమాండ్‌తో ఈ కార్యక్రమం జరిగింది. సమస్యల పరిష్కారం కాకపోతే ఈ నెల 7వ తేదీన కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామని వారు హెచ్చరించారు.
కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లే సమయంలో పోలీసులు అడ్డుకోవడంతో వైసీపీ నాయకులు జగ్గిరెడ్డి ముందుండి చొరవ చూపగా, వాగ్వాదం నెలకొంది. ప్రజల సమస్యల పరిష్కారానికై వెళ్లే వారిని అడ్డుకోవడం సరికాదని జగ్గిరెడ్డి పోలీసులకు వివరించారు. తర్వాత వైసీపీ నాయకులు అందరూ కలెక్టర్ కార్యాలయంలోకి ప్రవేశించారు.
ఈ సందర్భంగా అమలాపురం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ డా. పినిపే శ్రీకాంత్, జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణ రావు, బొమ్మి ఇజ్రాయెల్, రాజోలు నియోజకవర్గ ఇంచార్జి గొల్లపల్లి సూర్యారావు, ఇతర నియోజకవర్గ ఇంచార్జిలు పాల్గొన్నారు.
అలాగే, పాముల రాజేశ్వరి దేవి, కాశి బాలముని కుమారి, గిరిజ నాగ కుమారి, టౌన్ ప్రెసిడెంట్ సంసాని నాని, రైతు సంఘాల నాయకులు, పలువురు వైసీపీ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కలెక్టర్ స్పందనపై ఆధారపడి ముందుగా నిర్ణయించిన ధర్నా చేయడం గానీ, వెనక్కి తగ్గడమో నిర్ణయిస్తామని వారు తెలిపారు.
