ఉగ్రదాడిపై సైనికాధికారులతో కీలక సమావేశం

After the Pahalgam terror attack, PM Modi and key officials held high-level meetings to review national security and counterterror steps. After the Pahalgam terror attack, PM Modi and key officials held high-level meetings to review national security and counterterror steps.

పహల్గామ్ ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. దేశ భద్రతకు సంబంధించి కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ భేటీ భారత భద్రతా వ్యవస్థ యొక్క స్పందన, వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించడంలో కీలకంగా నిలిచింది.

ఈ సమావేశానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్‌తో పాటు త్రివిధ దళాల అధిపతులు, ఇతర కీలక భద్రతా అధికారులు హాజరయ్యారు. సమావేశం దాదాపు గంటన్నర పాటు సాగింది. పహల్గామ్ దాడి అనంతర పరిణామాలు, సరిహద్దు భద్రత పరిస్థితులు, దేశ అంతర్గత భద్రత అంశాలపై మౌలికంగా చర్చలు జరిగాయి.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత సాయుధ బలగాలపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని, ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యమని తెలిపారు. భద్రతా దళాలకు అవసరమైనంత స్వేచ్ఛ, సాధనాలను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. పహల్గామ్ దాడికి బాధ్యత వహించే వారిని గట్టిగా ఎదుర్కొనడానికి సైన్యం సిద్ధంగా ఉండాలన్నది ఆయన స్పష్టం చేశారు.

ఇక ఇదే అంశంపై మంగళవారం సాయంత్రం కేంద్ర హోం శాఖ కార్యాలయంలో మరో భేటీ జరిగింది. హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఎస్ఎస్‌బీ, ఐటీబీపీ, ఎన్‌ఎస్‌జీ, అస్సాం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్స్ పాల్గొన్నారు. భద్రతా ఏర్పాట్లు, జవాబుదారీ చర్యలు, సరిహద్దు ముట్టడులపై సమీక్ష నిర్వహించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నివారించేందుకు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయడం పైనా చర్చ జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *