హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన భర్తను కరెంట్ షాక్‌తో హత్య చేసి, మృతదేహాన్ని పాతిపెట్టి, కుటుంబ సభ్యులను, చుట్టుపక్కల వారిని మోసం చేయడానికి కట్టుకథలు అల్లింది. కానీ చివరకు ఆమె ఆట కట్టింది.
పోలీసుల కథనం ప్రకారం.. సాయిలు అనే వ్యక్తి, కవిత అనే మహిళ దంపతులుగా జీవనం సాగిస్తున్నారు. వీరి మధ్య అనారోగ్యం, మనస్పర్థల కారణంగా విభేదాలు ఏర్పడ్డాయి. ఇద్దరికీ వివాహేతర సంబంధాలు ఉండటంతో తరచూ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. సాయిలు తన భార్య కవితను తరచూ వేధిస్తూ ఉండేవాడట.
దీంతో భర్తపై విరక్తి చెందిన కవిత.. చెల్లెలు, ఆమె భర్త సహకారంతో ఘోరమైన పథకం వేసింది. ముగ్గురు కలిసి ప్లాన్ ప్రకారం సాయిలుకు విద్యుద్ఘాతం ఇచ్చి చంపేశారు. ఆపై అతని శవాన్ని పాతిపెట్టి, ఆమె సొంతూరుకు వెళ్లిపోయింది. భర్త గురించి అడిగిన వారందరికీ పనికెళ్లి తిరిగి రాలేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది.
అయితే కవిత మాటల్లో అనుమానం పుట్టిన బంధువులు పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులు కవితను విచారించగా అసలు విషయం బయటపడింది. నేరాన్ని అంగీకరించిన కవితను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఆమె చెల్లెలు, బావపై కూడా కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు.