జమ్మూలో ఇగ్నో ప్రొఫెసర్‌పై సైనికుల దాడి ఆరోపణ

IGNOU Professor Alleges Army Assault in J&K IGNOU Professor Alleges Army Assault in J&K

జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా నౌషెరా ప్రాంతంలో ఘర్షణ కలకలం రేపింది. ఢిల్లీలో పనిచేస్తున్న ఇగ్నో ప్రొఫెసర్ లియాఖత్ అలీపై సైనికులు దాడి చేశారని ఆరోపించారు. గురువారం రాత్రి వివాహ వేడుక అనంతరం తన బంధువులతో కలిసి తిరిగి వస్తుండగా, లామ్ గ్రామం వద్ద వాహన తనిఖీ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు.

తనపై ఎలాంటి కారణం లేకుండానే ఆయుధాలతో దాడి చేశారని అలీ తెలిపారు. తలకు బలమైన గాయమై, ఆరు కుట్లు పడ్డాయని వెల్లడించారు. తన కుటుంబంలో సైనికులు ఉన్నా, ఈ ఘటన ఎంతో బాధాకరంగా ఉందని వాపోయారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ నౌషెరా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గుర్తుతెలియని సైనికులపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటనపై సైన్యం స్పందించింది. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై సమాచారంతో తనిఖీలు చేపట్టామని తెలిపింది. తనిఖీ సమయంలో ప్రొఫెసర్ వాహనం ఆపినప్పుడు ఆయుధం లాక్కొనే ప్రయత్నం చేశారని, దీంతో ఘర్షణ జరిగిందని పేర్కొంది. ఘటనపై సమగ్ర విచారణ చేపడతామని, ఎవరైనా సైనికులు తప్పుచేసి ఉంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

Army Orders Inquiry After University Professor Claims Assault By Troops In  J&K's Rajouri - Daily Excelsior

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పూర్తి నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. ఒక వైపు ప్రొఫెసర్ లియాఖత్ ఆరోపణలు తీవ్రతరం కావడంతో మీడియా వర్గాల్లో చర్చనీయాంశమవుతుండగా, మరోవైపు సైన్యం కూడా స్పష్టత ఇవ్వడమే కాకుండా విచారణకు ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *