బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తెలుగులో ‘వాల్తేరు వీరయ్య’, ‘స్కంద’ వంటి చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో మెరిసిన ఆమె, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర స్పందన వ్యక్తమవుతోంది. ఆమె ఉత్తర భారతదేశంలో తన పేరుతో గుడి ఉందని, దక్షిణాదిలో కూడా తనకోసం గుడి కట్టాలని అభిమాని ఆశ పడుతుందని చెప్పిన మాటలు చర్చనీయాంశంగా మారాయి.
ఒక ప్రముఖ మీడియా ఇంటర్వ్యూలో ఊర్వశి మాట్లాడుతూ, “బద్రీనాథ్ ఆలయం పక్కనే ఉన్న ఊర్వశి ఆలయం నాకు అంకితంగా ఉంది. ఇక్కడ టాలీవుడ్‌లో కూడా స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించాను. దాంతో నా అభిమానులు ఇక్కడ కూడా నాకు గుడి కట్టాలని కోరుకుంటున్నారని” చెప్పింది. ఆమె ఈ వ్యాఖ్యలు స్వయంగా కోరికగా చెప్పడంతో నెటిజన్లు ఆశ్చర్యపోయారు.
ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఆమె నమ్మకాన్ని మెచ్చుకుంటున్నప్పటికీ, మరికొందరు ఇది అతిశయోక్తిగా భావిస్తూ విమర్శిస్తున్నారు. ‘తనకోసం గుడి కట్టాలి’ అనడం దైవ భావనను తక్కువ చేస్తోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. విమర్శలతో పాటు ట్రోలింగ్ కూడా పెరుగుతోంది.
ఇది మొదటి సారి కాదు. గతంలో కూడా ఊర్వశి చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాలకు దారితీశాయి. తన సినిమా వసూళ్లు గురించి, ఇతర నటుల సినిమాల ఫెయిల్యూర్‌ను పోల్చుతూ చేసిన వ్యాఖ్యలపై అప్పుడే ట్రోలింగ్ జరిగింది. ఇప్పుడు గుడిపై చేసిన వ్యాఖ్యలతో మళ్లీ ఆమె పేరు మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
