ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సారధిగా మహేంద్ర సింగ్ ధోనీ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. వికెట్ల వెనక తన మాజికల్ ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకున్నాడు. స్టంపౌట్, క్యాచ్, రనౌట్‌లతో ఓ అసలైన కీపర్ ఎలా ఉంటాడో మరోసారి చూపించాడు.
ధోనీ చేసిన అద్భుత రనౌట్ ఈ మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది. చివరి ఓవర్‌లో ఎల్ఎస్జీ ఆటగాడు అబ్దుల్ సమ్మద్ పరుగు కోసం ప్రయత్నించగా, బంతిని అందుకున్న ధోనీ అంచనాలకు మించి వేగంగా స్పందించాడు. నాన్ స్ట్రయిక్ ఎండ్‌లో వికెట్లను టార్గెట్ చేస్తూ నేరుగా విసిరిన త్రో, వికెట్లు గిరాటేసింది. ఇది చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ధోనీ కీపింగ్ మేజిక్ చూసి అభిమానులు తెగ ముచ్చటపడుతున్నారు. “వికెట్ల వెనక మాహీ అంటే బ్యాట్స్‌మెన్‌కు బెడదే”, “సమ్మద్ బహుశా ధోనీని మరిచిపోయాడేమో!” అంటూ కామెంట్లు పెట్టుతున్నారు. తలా మాయాజాలం మరోసారి వెలుగులోకి వచ్చింది.
ధోనీ ఆట నైపుణ్యం, చురుకుదనం ఇప్పటికీ తగ్గలేదని ఈ మ్యాచ్ మరోసారి నిరూపించింది. వయసు మళ్లినా ధోనీ ఎనర్జీ మాత్రం అదే స్థాయిలో ఉండటం అభిమానుల గర్వకారణంగా మారింది. కెప్టెన్సీ తిరిగి స్వీకరించిన తలా… ఇప్పుడు తన మార్క్ ఆటతో సీఎస్కేను తిరిగి పాత గౌరవానికి తీసుకెళ్తున్నాడు.