హర్యానాలోని సోనిపట్‌లో ఉన్న ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయంలో అబ్బాయి ఓ అసాధారణ యత్నం చేశాడు. తన గర్ల్‌ఫ్రెండ్‌ను బాలుర హాస్టల్‌లోకి తీసుకెళ్లాలని భావించి, ఆమెను పెద్ద సూట్‌కేస్‌లో ప్యాక్ చేశాడు. ఆ తర్వాత ఆ సూట్‌కేస్‌తో హాస్టల్‌కి వెళ్లాడు.
హాస్టల్ వద్ద గార్డులకు అతడి ప్రవర్తనపై అనుమానం రావడంతో లగేజ్‌ను చెక్ చేశారు. సూట్‌కేస్‌ను ఓపెన్ చేయగానే అందులో యువతి కనిపించడంతో అధికారులు షాక్‌కు గురయ్యారు. వెంటనే ఆమెను బయటకు తీసి అక్కడి వారందరూ నిర్ఘాంతపోయారు.
ఈ ఘటనను అక్కడే ఉన్న ఇతర విద్యార్థులు వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో క్షణాల్లో వైరల్ అయింది. ఈ ఘటనపై నెటిజన్లు తమదైన శైలిలో రియాక్ట్ అవుతున్నారు. కొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తుండగా, మరికొందరు హాస్టల్ భద్రతపై ప్రశ్నలు వేస్తున్నారు.
ఇదంతా జరిగినా ఇప్పటివరకు విశ్వవిద్యాలయం అధికారికంగా స్పందించలేదు. ఆ విద్యార్థిపై చర్యలు తీసుకున్నారా లేదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే, ఇలాంటి సంఘటనలు భద్రతా చర్యలపై మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
