హైదరాబాద్–అమరావతికి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే

NDA govt approves Greenfield Expressway to boost connectivity between Telugu states, connecting Hyderabad and Amaravati via a strategic highway. NDA govt approves Greenfield Expressway to boost connectivity between Telugu states, connecting Hyderabad and Amaravati via a strategic highway.

తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య వాణిజ్య, రవాణా సంబంధాలను మరింత మెరుగుపరచేందుకు హైదరాబాద్-అమరావతి మధ్య గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకు అవసరమైన ప్రాథమిక సన్నాహాలు పూర్తయ్యాయి.

ఈ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. Detailed Project Reports (డీపీఆర్‌లు) త్వరలో సిద్ధమవుతాయని సమాచారం. అనంతరం నిర్మాణ పనులు మొదలవుతాయి. ఈ ప్రాజెక్టు అమలయ్యితే రెండు నగరాల మధ్య ప్రయాణ దూరం, సమయం గణనీయంగా తగ్గనుంది.

ఇదిలా ఉంటే, అమరావతి రింగ్ రోడ్ ప్రారంభానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే దీనిని ప్రారంభించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఈ రోడ్ నుండి ఉత్తర భాగంగా కొత్త హైవే ప్రారంభానికి కూడా కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్టు సమాచారం.

ఈ హైవే నిర్మాణంతో ఆర్ధిక, వాణిజ్య, వ్యవసాయ అభివృద్ధికి తోడ్పాటు అందనుంది. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఏపీ రాజధానికి, అలాగే ఏపీ తీర ప్రాంతాలకు అనుసంధానం మరింత వేగవంతం కానుంది. దీని ద్వారా ప్రయాణికులకు, వ్యాపారులకు అనేక ప్రయోజనాలు లభించనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *