ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘డ్రాగన్’ మూవీ థియేటర్లలో మంచి స్పందన అందుకుంది. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. 37 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా, 150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టడం విశేషం. ఇప్పుడు తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.
ఈ కథ 2014 నుంచి 2025 మధ్య కాలంలో సాగుతుంది. కథానాయకుడు రాఘవన్ (ప్రదీప్ రంగనాథన్) ఒక మిడిల్ క్లాస్ యువకుడు. అతని జీవితంలో ఉన్న చిటికెడు ఆశలు, ప్రేమించిన అమ్మాయి కీర్తి (అనుపమ పరమేశ్వరన్)ను కోల్పోవడం, భవిష్యత్తులో సక్సెస్ సాధించాలనే తపన – ఈ విషయాలన్నింటి చుట్టూ కథ తిరుగుతుంది. అడ్డదారుల్లో ప్రయాణిస్తూ ఎదుగుదల సాధించిన రాఘవన్, అనూహ్య సంఘటన ఎదురయ్యే సరికి ఎలా మారతాడు? అనేది సినిమాకు హైలైట్.
సినిమా జీవితం, దానిలో తల్లిదండ్రుల, గురువు, జీవిత భాగస్వాముల పాత్ర ఎంత ముఖ్యమో ఈ కథ తెలియజేస్తుంది. ప్రతిఒక్కరి జీవితంలో కష్టపడి సాధించుకున్న విజయమే నిజమైన గౌరవాన్ని తెస్తుందని సందేశాన్ని అందిస్తుంది. శ్రమ లేకుండా వచ్చినదానికి విలువ ఉండదని చెప్పే ఈ కథ, యూత్‌కి మంచి ఇన్‌స్పిరేషన్‌ను అందిస్తుంది.
దర్శకుడు అశ్వత్ మారిముత్తు కథను వినోదం, సందేశంతో మిళితం చేసి, ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ట్విస్ట్ సినిమాకి హైలైట్‌గా నిలిచాయి. ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్ నటనతో పాటు మిస్కిన్ పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సంగీతం, ఫొటోగ్రఫీ, ఎడిటింగ్ టెక్నికల్‌గా సినిమాకు బలాన్ని అందించాయి. చివరగా, ‘డ్రాగన్’ సినిమా ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు జీవిత పాఠాలు నేర్పించే చక్కటి చిత్రమని చెప్పొచ్చు.