ట్రంప్ నిర్ణయానికి కోర్టు షాక్ – ట్రాన్స్‌జెండర్లకు న్యాయం

Court rejects Trump’s transgender ban, citing constitutional equality. Orders reversal of the restrictions. Court rejects Trump’s transgender ban, citing constitutional equality. Orders reversal of the restrictions.

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కీలక నిర్ణయానికి న్యాయస్థానం ఎదురుదెబ్బ ఇచ్చింది. ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ట్రాన్స్‌జెండర్లపై కొన్ని నిషేధాలు విధించారు. ముఖ్యంగా, మహిళల క్రీడా పోటీల్లో ట్రాన్స్‌జెండర్లను అనుమతించకుండా ఆదేశాలు జారీ చేశారు. అలాగే, అమెరికా మిలటరీ విభాగంలో ట్రాన్స్‌జెండర్ల నియామకాన్ని రద్దు చేశారు.

ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు ఫెడరల్ కోర్టును ఆశ్రయించారు. నిన్న జరిగిన విచారణలో, ట్రాన్స్‌జెండర్ల హక్కులను కాలరాస్తూ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు తేల్చి చెప్పింది. సమానత్వ సూత్రాన్ని ఉల్లంఘించడంతో పాటు, ట్రాన్స్‌జెండర్ల హక్కులను హరించడమే ఈ నిషేధాల ఉద్దేశమని కోర్టు అభిప్రాయపడింది. అమెరికా స్వాతంత్ర్య ప్రకటన ప్రకారం, ప్రతి మానవుడికి సమాన హక్కులు ఉన్నాయని కోర్టు స్పష్టం చేసింది.

ఇదే విచారణలో టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) మూసివేతపై మరో పిటిషన్‌పై విచారణ జరిగింది. అమెరికా ప్రభుత్వం యూఎస్ ఎయిడ్‌ను మూసివేయడం రాజ్యాంగ ఉల్లంఘనగా పరిగణిస్తూ, కోర్టు వెంటనే ఆ మూసివేతను నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ తీర్పుతో ట్రాన్స్‌జెండర్ల హక్కులకు మరింత బలమైన మద్దతు లభించినట్లైంది. ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయంపై కోర్టు మళ్లీ సమీక్ష చేపట్టే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *