‘యానిమల్’ సినిమాతో సందీప్ రెడ్డి వంగా పాన్ ఇండియా డైరెక్టర్‌గా ఎదిగారు. రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన ఈ మూవీ భారీ విజయం సాధించి సందీప్ క్రేజ్‌ను మరింత పెంచింది. ఇప్పుడు ఆయన ప్రభాస్‌తో ‘స్పిరిట్’ సినిమాకు దర్శకత్వం వహించనున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా, సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఓ యాడ్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఈ యాడ్‌లో ప్రధాన పాత్రలో నటించగా, ఇది ఓ ఎలక్ట్రిక్ సైకిల్ బ్రాండ్ ప్రకటనగా రూపొందించబడింది. వీడియోలో ధోనీ, ‘యానిమల్’ సినిమాలో రణబీర్ క్యారెక్టర్లా స్టైల్‌గా సైకిల్‌పై ఎంట్రీ ఇవ్వడం విశేషం.
ప్రస్తుతం ఈ యాడ్‌కు సంబంధించిన ప్రోమోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సందీప్ రెడ్డి మార్క్ టేకింగ్, ధోనీ యాటిట్యూడ్ దీనికి ప్రత్యేక ఆకర్షణగా మారాయి. అభిమానులు ఈ యాడ్ పూర్తిగా విడుదల కావాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
యానిమల్ తర్వాత సందీప్ రెడ్డి రూపొందించిన ఈ యాడ్ అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. ఎంఎస్ ధోనీ, సందీప్ రెడ్డి కాంబినేషన్లో మరిన్ని ప్రాజెక్టులు రానున్నాయా? అన్న ఉత్సుకత అభిమానుల్లో నెలకొంది. ఇక పూర్తి యాడ్ విడుదలైతే మరోసారి సంచలనం సృష్టించనుందని చెప్పొచ్చు.