సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై ఆంధ్రప్రదేశ్‌లో 17 వరకు కేసులు నమోదయ్యాయి. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. ప్రస్తుతం పోసాని ఏ పోలీస్ స్టేషన్‌లో ఉంటారు? ఏ కోర్టుకు హాజరవుతారు? అనే అంశం తెలియని పరిస్థితి నెలకొంది.
తాజాగా, కర్నూలు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానిని విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. పీటీ వారెంట్ పై పోలీసులు విజయవాడకు తీసుకువచ్చారు. ఈ రోజు ఆయనను కోర్టులో హాజరుపరచనున్నారు. కోర్టు నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
కోర్టు రిమాండ్ విధిస్తే విజయవాడ జైలుకు తరలించనున్నారు. రిమాండ్ విధించకపోతే తిరిగి కర్నూలు జిల్లా జైలుకు పంపనున్నారు. పోసానిపై నమోదైన కేసులు, ఆయన చుట్టూ ఏర్పడిన వివాదం ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ కేసులపై పోసాని ఏమి సమాధానం ఇస్తారో, కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది. రాజకీయ వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న ఆయన భవిష్యత్తు ఏమిటనేది త్వరలో స్పష్టమవుతుందని అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి.
