మిల్కీ బ్యూటీ తమన్నా, నటుడు విజయ్ వర్మ మధ్య ప్రేమాయణం గత కొంతకాలంగా చర్చనీయాంశమైంది. 2023లో వచ్చిన ‘లస్ట్ స్టోరీస్’ సిరీస్ షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన ఈ జంట, తమ సంబంధాన్ని బహిరంగంగా ప్రకటించారు. అప్పటి నుంచి వీరి జోడీ బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
తమన్నా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమను గురించి మాట్లాడుతూ, తన ప్రపంచంలో విజయ్ వర్మ వచ్చాడని, అతడితో ఉన్నప్పుడే పూర్తి సంతోషాన్ని అనుభవిస్తున్నానని తెలిపింది. అయితే, 35 ఏళ్ల వయసులోకి వచ్చిన తమన్నా పెళ్లి చేసుకుని సెటిల్ కావాలని అనుకుంటుండగా, విజయ్ వర్మ మాత్రం కెరీర్‌పై దృష్టి పెట్టాలని భావించాడని తెలుస్తోంది.
ఇద్దరి మధ్య పెళ్లి విషయంలో అభిప్రాయ భేదాలు తలెత్తడంతో మనస్పర్థలు ఏర్పడ్డాయని, ఈ కారణంగా వారు విడిపోయారని బీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. తమన్నా త్వరలో కుటుంబ జీవితాన్ని ప్రారంభించాలని భావిస్తుండగా, విజయ్ మాత్రం ఇప్పుడే ఆలోచన చేయడం ఇష్టం లేదని చెప్పాడట. ఈ విషయం వారిద్దరి మధ్య దూరాన్ని పెంచినట్లు సమాచారం.
ఇద్దరూ మ్యూచువల్‌గా ఈ నిర్ణయం తీసుకున్నారా లేక నిజంగా బ్రేకప్ జరిగిందా అనే విషయంపై స్పష్టత రాలేదు. కానీ, ఇటీవల సోషల్ మీడియాలో తమన్నా, విజయ్ వర్మ కలిసి కనిపించడం తగ్గిపోయినట్లు అభిమానులు గమనిస్తున్నారు. వీరి రిలేషన్‌షిప్ ఫ్యూచర్‌పై అధికారిక ప్రకటన కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.
