ఐసీసీ ఫైనల్స్‌లో రోహిత్ శర్మ అరుదైన రికార్డు

Rohit Sharma becomes the first captain to lead India to four ICC finals, surpassing Dhoni’s feat. Fans now hope for a Champions Trophy win. Rohit Sharma becomes the first captain to lead India to four ICC finals, surpassing Dhoni’s feat. Fans now hope for a Champions Trophy win.

భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. క్రికెట్ చరిత్రలోనే నాలుగు ఐసీసీ టోర్నమెంట్లలో జట్టును ఫైనల్స్‌కు చేర్చిన తొలి కెప్టెన్‌గా నిలిచాడు. 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్, 2023 వన్డే వరల్డ్‌కప్, 2024 టీ20 వరల్డ్‌కప్, ఇప్పుడు 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాను ఫైనల్‌కు చేర్చాడు. ఈ ఘనత సాధించిన ఏ కెప్టెన్‌ కూడా ఇంతకు ముందు లేరు.

అయితే, రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, 2023 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చవిచూసింది. కానీ, 2024 టీ20 వరల్డ్‌కప్‌లో మాత్రం దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్‌ను సాధించింది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోనూ భారత జట్టు విజయం సాధించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన కెరీర్‌లో మూడు ఐసీసీ ట్రోఫీలను గెలిచాడు. 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని భారత జట్టుకు అందించాడు. అయితే, ధోనీ కెప్టెన్సీలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్ లేకపోవడంతో అతనికి ఈ ఫీట్ సాధించే అవకాశం రాలేదు. కానీ, రోహిత్ ఇప్పుడు టెస్ట్ ఛాంపియన్‌షిప్‌తో సహా నాలుగు ఐసీసీ ఫైనల్స్‌కు భారత జట్టును తీసుకెళ్లాడు.

ఇక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత జట్టును తొలి సారి తీసుకెళ్లిన కెప్టెన్ విరాట్ కోహ్లీ. అయితే, 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడంతో కోహ్లీకి విజయం దక్కలేదు. ఇప్పుడు రోహిత్ శర్మ నేతృత్వంలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుస్తుందా? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *