ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు ఇవే!

This week, hit films like Tandel, Rekha, Kudumbasthan, and more are set to stream on major OTT platforms. This week, hit films like Tandel, Rekha, Kudumbasthan, and more are set to stream on major OTT platforms.

ఈ వారం ఓటీటీలో భారీ సినిమాల రాకతో మంచి సందడి కనిపించనుంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో భారీ విజయాలను అందుకున్న సినిమాలు ఒకదాని తరువాత ఒకటి స్ట్రీమింగ్‌కి సిద్ధంగా ఉన్నాయి. నాగ చైతన్య – సాయిపల్లవి జంటగా నటించిన ‘తండేల్’ సినిమా ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదలై మంచి వసూళ్లను సాధించింది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా, చైతూ కెరీర్‌లో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఈ మూవీ ఈ నెల 7 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

మలయాళంలో క్రైమ్ థ్రిల్లర్‌గా సంచలనం సృష్టించిన ‘రేఖా’ సినిమా కూడా ఓటీటీలో సందడి చేయనుంది. జనవరి 9న విడుదలైన ఈ సినిమా కేవలం 10 కోట్ల బడ్జెట్‌తో 75 కోట్ల వసూళ్లు రాబట్టడం హాట్ టాపిక్‌గా మారింది. అసిఫ్ అలీ – అనశ్వర రాజన్ ప్రధాన పాత్రల్లో నటించగా, మమ్ముట్టి అతిథి పాత్రలో మెరిశారు. జోఫిన్ చాకో దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఫిబ్రవరి 7 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

తమిళంలో జనవరి 24న విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన ‘కుడుంబస్థాన్’ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉంది. మణికందన్ – శాన్వి మేఘన జంటగా నటించిన ఈ సినిమా 8 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమై, పాతిక కోట్ల వసూళ్లు రాబట్టి విజయాన్ని సాధించింది. వైశాఖ్ సంగీతం అందించిన ఈ సినిమా, ఫిబ్రవరి 7 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ కానుంది.

ఇక ఇదే రోజున జియో హాట్‌స్టార్‌లో ‘బాపు’ సినిమా విడుదల కానుండగా, ఫిబ్రవరి 6న ఈటీవీ విన్‌లో ‘ధూం ధాం’ స్ట్రీమింగ్ కానుంది. ఈ వారం విడుదల కానున్న ఈ సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునే అవకాశం ఉంది. ఓటీటీ వినియోగదారులు మంచి కంటెంట్‌తో సందడి చేసే వారం కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *