దక్షిణ నియోజకవర్గ ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావిస్తూ, వారికి సేవ చేయడం తన ధర్మంగా తీసుకున్న మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తన సహాయ హస్తాన్ని అందిస్తున్నారు. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా, ప్రమాదంలో కాలుఫ్రాక్చర్ అయిన వైసీపీ 29వ వార్డ్ సీనియర్ నాయకుడు అడపా శివకు మెడికల్ ఖర్చుల కోసం రూ.10,000 ఆర్థిక సాయం అందజేశారు. వైసీపీ శ్రేణులతో కలిసి వారి ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించి భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ మాట్లాడుతూ, గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాలు పేదలకు అండగా నిలిచేవని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవి ఎండమావులుగా మారాయని విమర్శించారు. ప్రజలకు మౌలిక వసతులు, ఆర్థిక భద్రత కల్పించే కార్యక్రమాలను నిలిపివేయడం దురదృష్టకరమని అన్నారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ విశాఖ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి రామానంద్, బీసీ సెల్ అధ్యక్షుడు సనపల రవీందర్ భరత్, 29వ వార్డ్ అధ్యక్షుడు పీతల వాసు, 30వ వార్డ్ అధ్యక్షుడు దశమంతుల మాణిక్యాలరావు, 33వ వార్డ్ అధ్యక్షుడు ముత్తాబత్తుల రమేష్, 39వ వార్డ్ అధ్యక్షుడు ముజీబ్ ఖాన్, 42వ వార్డ్ అధ్యక్షుడు బేశెట్టి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సమాజ సేవ తన బాధ్యతగా భావిస్తున్న వాసుపల్లి గణేష్, ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. ప్రజల కోసం పని చేసే వారి వెంటే తన సహాయాన్ని అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ వైసీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అనేక మంది పార్టీ మద్దతుదారులు పాల్గొన్నారు.

 
				 
				
			 
				
			 
				
			