గాజువాక పరిసర ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం గాజువాక పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఓపెన్ డ్రింకింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ ప్రత్యేక తనిఖీలను సిఐ పార్థసారథి నేతృత్వంలో ఎస్సైలు రాధాకృష్ణ, రవికుమార్, మన్మధరావు, నజీర్, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ సంయుక్తంగా నిర్వహించారు.
ఈ డ్రైవ్‌లో భాగంగా వివిధ ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం సేవిస్తున్న 57 మందిని గుర్తించి అరెస్ట్ చేశారు. వీరిని గాజువాక పోలీస్ స్టేషన్ కు తరలించి, చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. బహిరంగంగా మద్యం సేవించడం సమాజంపై చెడు ప్రభావాన్ని చూపుతుందని పోలీసులు తెలిపారు.
అరెస్ట్ చేసిన వారిపై సంబంధిత చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కోర్టుకు తరలించారు. పోలీసులు చేపట్టిన ఈ చర్యకు స్థానికులు మద్దతు తెలిపారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే విధంగా మద్యం సేవిస్తున్న వారిపై ఇకపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
ఈ స్పెషల్ డ్రైవ్‌ను గాజువాక ఏసీబీ ప్రత్యేకంగా అభినందించారు. సమాజం ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామని గాజువాక పోలీసులు పేర్కొన్నారు. భద్రతా పరంగా ఇటువంటి చర్యలు కొనసాగుతాయని ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

 
				 
				
			 
				
			 
				
			