ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని తడికలపూడిలో లూర్ధుమాత మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మహోత్సవాల్లో ముఖ్య అతిథిగా చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ పాల్గొన్నారు. పుణ్యక్షేత్ర డైరెక్టర్ Dr. Rev. Fr. నాతానియేలు, సిస్టర్స్, ఉపదేశీ మాస్టర్లు శాసనసభ్యులను మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. భక్తుల సమక్షంలో మహోత్సవాలు వైభవంగా కొనసాగాయి.
ఈ సందర్భంగా MLA సొంగా రోషన్ కుమార్ లూర్ధుమాత నూతనంగా నిర్మించిన గుహను ప్రారంభించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భక్తుల విశ్వాసానికి నూతనంగా తీర్చిదిద్దిన గుహ మహోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తుల కోరికలు తీర్చే తల్లి లూర్ధుమాత ఆశీస్సులు అందరికీ కలుగాలని ఆయన ఆకాంక్షించారు.
ఫాదర్ నాతానియేలు MLA సొంగా రోషన్ కుమార్‌ను ఆశీర్వదించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ మహోత్సవాల్లో పాల్గొనడం తనకు ఎంతో ఆనందదాయకమని, లూర్ధుమాత ఆశీస్సులు భక్తులందరికీ ఉంటాయని MLA అన్నారు. భక్తులు అందరూ చింతలపూడి అభివృద్ధి కోసం ప్రార్థించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ వేడుకలకు మండల కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. లూర్ధుమాత మహోత్సవాల్లో MLA పాల్గొనడం భక్తులందరికీ ఆనందాన్ని కలిగించింది. మహోత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు, ప్రార్థనలు, మ్యూజికల్ విందు వంటి కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.

 
				 
				
			 
				
			 
				
			