2022లో విడుదలైన ‘ఓదెల రైల్వే స్టేషన్’ మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ చిత్రానికి కొనసాగింపుగా ‘ఓదెల-2’ రాబోతోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఈ సినిమాకు కథ అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తుండగా, అకోశ్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తోంది. తాజాగా మహాకుంభ మేళాలో ‘ఓదెల-2’ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. టీజర్‌లో తమన్నా లేడీ అఘోరా గెటప్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. భయానకమైన వాతావరణంలో ఆమె నటన ఉత్కంఠ రేకెత్తించేలా ఉంది. ఈ పాత్రలో తమన్నా నటన ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
శివశక్తిగా తమన్నా పోషించిన పాత్ర సినిమాలో కీలకంగా నిలుస్తుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఆమె లుక్, హావభావాలు కొత్తగా ఉండటంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. సంపత్ నందితో కలిసి మధు క్రియేషన్స్ పతాకంపై డి. మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడిగా అజనీశ్ లోక్‌నాథ్ పని చేస్తున్నారు.
టీజర్‌కు వచ్చిన భారీ రెస్పాన్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. యాక్షన్, థ్రిల్, మిస్టరీతో కూడిన ఈ సినిమా భిన్నమైన కథాంశంతో తెరకెక్కనుంది. ‘ఓదెల-2’ త్వరలో విడుదల కానుండగా, ఈ టీజర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది.