మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైన్‌లో పెట్టి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన ‘విశ్వంభర’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండగా, మరోవైపు ‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమా గురించి ఆసక్తికరమైన వార్త ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది.
ఈ చిత్రంలో చిరంజీవి సరసన బాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీ నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు కథలో హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఉండటంతో, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రాణీ ముఖర్జీ అయితే బాగుంటుందని సూచించారని తెలుస్తోంది. చిరంజీవి కూడా ఈ ఆలోచనకు అంగీకరించారని సమాచారం. బాలీవుడ్‌లో తన అందంతో, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాణీ, చాలా కాలం తర్వాత సౌత్‌లో అడుగుపెడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ చిత్రానికి హీరో నాని సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. నాని గతంలో శ్రీకాంత్ ఓదెలతో ‘దసరా’ సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల, నాని కాంబినేషన్‌లో రాబోయే ఈ సినిమా మాస్ ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా మేకర్స్ భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని టాక్. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే ఈ వార్త బాలీవుడ్, టాలీవుడ్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాణీ ముఖర్జీ చిరంజీవి సినిమాతో రీ-ఎంట్రీ ఇస్తుందా? లేదంటే మరో స్టార్ హీరోయిన్ ఈ పాత్రలో నటిస్తుందా? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. త్వరలోనే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.