సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీని వివాహం చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. వీరి పెళ్లి కొద్దిమంది కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో సింపుల్‌గా జరిగింది. అయితే పెళ్లికి హాజరైన అతిథులు సెల్‌ఫోన్లు తీసుకురావొద్దని షరతు పెట్టడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో రకుల్ ప్రీత్ సింగ్ దీనిపై స్పందించింది. పెళ్లి ఫోటోలు, వీడియోలు బయటకు రావద్దనే ఉద్దేశంతో ఫోన్లను నిషేధించారని వస్తున్న వార్తలు అవాస్తవమని ఆమె స్పష్టం చేసింది. అసలు కారణం పెళ్లి వేడుకను ఆత్మీయంగా జరుపుకోవడమేనని చెప్పింది. అందరూ మధుర క్షణాలను ఆస్వాదించాలన్న ఉద్దేశంతోనే ఈ నిబంధన పెట్టామని వివరించింది.
విలాసానికి భిన్నంగా, సౌకర్యమే తనకు ముఖ్యమని రకుల్ వెల్లడించింది. పెళ్లికి కేవలం సన్నిహితులను మాత్రమే ఆహ్వానించామని, వారితో ఆనందాన్ని పంచుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. పెళ్లి తర్వాత ఫోటోలను స్వయంగా తనే సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు వెల్లడించింది.
ఇక సినిమాల విషయానికి వస్తే, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన తాజా చిత్రం ‘మేరే హస్బెండ్ కీ బీవీ’ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా గురించి ఆమె ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు పేర్కొంది. అభిమానులు, సినీ ప్రేమికులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
