ఏపీ డిప్యూటీ సీఎం నారా లోకేశ్, ఆయన అర్ధాంగి నారా బ్రాహ్మణి, తనయుడు నారా దేవాన్ష్ నేడు ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు హాజరయ్యారు. ఈ పవిత్ర సంఘటనలో వారు త్రివేణి సంగమం వద్ద షాహి స్నానఘట్టంలో పవిత్ర స్నానాలు ఆచరించారు.
సంప్రదాయబద్ధంగా గంగాదేవికి పూజలు చేసి, హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా, నారా బ్రాహ్మణి తన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మహా కుంభమేళా-2025 లో పాల్గొనడం జీవితకాలపు అనుభూతి అని ఆమె అభివర్ణించారు.
ప్రయాగరాజ్ లో పవిత్ర స్నానం ఆచరించడం, కుంభమేళా అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమం ఆమెకు ఎంతో మానసిక శాంతిని, దివ్య శక్తిని అనుభూతి కలిగించిందని నారా బ్రాహ్మణి తెలిపారు.
ఈ మహిమాన్విత గడ్డపై తరలివచ్చిన కోట్లాది మంది సామూహిక విశ్వాసాల నుండి ఆమె అద్భుతమైన దివ్య శక్తిని అనుభూతి చెందారని పేర్కొన్న నారా బ్రాహ్మణి, తమ కుంభమేళా పర్యటన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు.





