ఆమదాలవలస నియోజకవర్గంలో పెండూరు ఎంపీడీఓ ఆఫీస్ లో జరిగిన జనరల్ బాడీ మీటింగ్ కి గౌరవ శాసన సభ్యులు & PUC చైర్మన్ శ్రీ కూన రవి కుమార్ గారు హాజరయ్యారు. ఈ సమావేశంలో, ప్రభుత్వ నిర్ణయాలు గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్య అందించడంపై మరియు ప్రజలకు సౌకర్యంగా ఉండేలా తీసుకోవాల్సిన చర్యలు ప్రస్తావించారు.
కార్యక్రమంలో, మాజీ ఎంపీపీ కూన ప్రమీల గారు, ఎంపీపీ కిల్లి ఉషారాణి గారు, ఎంపీడీవో మన్మధరావు గారు, మరియు ఇతర ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజలకి చేరువచేయాలని, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని వారికి తెలియచేశారు.
గౌరవ శాసన సభ్యుడు కూన రవి కుమార్ గారు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం కోసం అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ నిర్ణయాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు వారిని ప్రేరేపించారు.
అంతేకాకుండా, ప్రభుత్వ అధికారులు అన్ని శాఖల కార్యక్రమాలపై సమీక్ష చేసి, ప్రజల అవసరాలకు అనుగుణంగా సేవలను అందించేందుకు చర్యలు చేపడతారని తెలిపారు.

 
				 
				
			 
				
			 
				
			