నెయ్యి మన ఆహారంలో ప్రాముఖ్యత కలిగినది. కొవ్వుపదార్థాలు అధికంగా ఉన్నా… సరైన రీతిలో తీసుకుంటే ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు నెయ్యిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి. నిపుణుల సూచనల మేరకు సరైన మోతాదులో నెయ్యిని తీసుకుంటే మెటాబాలిజం వేగవంతం అవుతుంది.
ఉదయమే మసాలా టీ లేదా బ్లాక్ కాఫీలో నెయ్యిని కలిపి తాగితే మంచి ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే దీనిలో పాలు కలపకుండా ఉండాలి. నెయ్యిలో ఉండే ఫ్యాటీ యాసిడ్లు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచేలా సహాయపడతాయి. అంతేగాక, ఇది శరీరంలో కొవ్వును కరిగించడంలో సహాయపడుతుందని పేర్కొంటున్నారు.
దాల్చిన చెక్క పొడి కలిపిన బ్లాక్ టీ లేదా మసాలా టీతో నెయ్యిని తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. నెయ్యిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, మసాలా టీలోని యాంటీ ఆక్సిడెంట్లతో కలిసిపడి ఇన్ ఫ్లమేషన్ తగ్గిస్తుంది. అలాగే, కడుపు నిండిన భావన కలుగుతుందని, దీనివల్ల అధిక ఆహారం తీసుకోవడం తగ్గి బరువు నియంత్రణలో ఉంటుంది.
నెయ్యి ఆరోగ్యానికి మేలు చేసేదే అయినా, అధిక మోతాదులో తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మధుమేహం, హైబీపీ, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు నెయ్యిని మితంగా ఉపయోగించాలి. వైద్యుల సూచనల మేరకు రోజుకు ఒకట్రెండు చెంచాల నెయ్యిని తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.