భవన్స్ శ్రీ రామకృష్ణ విద్యాలయం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా స్వామి బోధ్ మయానంద్, ఐఏఎస్ అధికారి నరసింహ రెడ్డి, జగదీష్ ప్రకాష్ లఖాని, భవన్స్ చైర్మన్ ప్రభాకర్ రావు తదితరులు హాజరయ్యారు. స్వామి బోధ్ మయానంద్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
విద్యార్థులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని అద్భుతమైన నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ముఖ్య అతిథులు తమ ప్రసంగాల్లో భవన్స్ శ్రీ రామకృష్ణ విద్యాలయం విద్యారంగంలో అందించిన సేవలను ప్రశంసించారు. విద్యార్థుల కృషిని అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా ఈ విద్యాలయం విద్యా ప్రమాణాలను కొనసాగించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థ నిర్వాహకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతం చేసిన విద్యార్థులు, టీచర్లు, స్టాఫ్ సభ్యులకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

 
				 
				
			 
				 
				