ఇంటర్ హాల్‌టికెట్లు వాట్సాప్ ద్వారా డౌన్‌లోడ్ సౌకర్యం

The government has enabled students to download inter hall tickets via WhatsApp. They can access them using the number 9552300009. The government has enabled students to download inter hall tickets via WhatsApp. They can access them using the number 9552300009.

ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇకపై హాల్‌టికెట్ల కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా హాల్‌టికెట్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. 9552300009 నంబర్ ద్వారా విద్యార్థులు నేరుగా తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ విధానం త్వరలో పదవ తరగతికి కూడా విస్తరించనున్నారు.

వాట్సాప్ ద్వారా హాల్‌టికెట్ పొందేందుకు ముందుగా గవర్నెన్స్ నంబర్‌ను సేవ్ చేసుకోవాలి. అనంతరం హాయ్ లేదా హాల్‌టికెట్ అని మెసేజ్ పంపాలి. వచ్చిన మెసేజ్‌లో ఉన్న ఆప్షన్ల ద్వారా విద్య సేవలు ఎంపిక చేసి, హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రోల్ నంబర్, హాల్‌టికెట్ నెంబర్, పుట్టిన తేది వంటి వివరాలు ఇచ్చిన వెంటనే హాల్‌టికెట్ డిస్‌ప్లే అవుతుంది.

ఇంటర్ బోర్డు ఇప్పటికే ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 10 నుంచి 20 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ రెండు సెషన్లలో జరుగుతాయి. వొకేషనల్ విద్యార్థులకు ఫిబ్రవరి 22 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయి.

వార్షిక పరీక్షలు మార్చి 1 నుంచి 19 వరకు మొదటి సంవత్సరం విద్యార్థులకు, మార్చి 3 నుంచి 20 వరకు రెండో సంవత్సరం విద్యార్థులకు నిర్వహించనున్నారు. విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రభుత్వం వాట్సాప్ ద్వారా హాల్‌టికెట్లను అందించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *