మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తొలిసారి తన ప్రేయసి పౌలా హర్డ్ గురించి మాట్లాడారు. ఆమెను ‘సీరియస్ గర్ల్‌ఫ్రెండ్’ గా అభివర్ణిస్తూ, తన జీవితాన్ని ఆమెతో ఆనందంగా గడుపుతున్నానని చెప్పారు. టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.
గేట్స్ మాట్లాడుతూ, “నా జీవితంలో పౌలా ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను. మేమిద్దరం కలిసి ఒలింపిక్స్ వంటి ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటూ జీవితాన్ని ఆస్వాదిస్తున్నాం” అన్నారు. 2022 నుంచి బహిరంగంగా కలిసి కనిపిస్తున్న ఈ జంట ఇప్పుడిప్పుడే వారి అనుబంధాన్ని బహిరంగంగా ప్రస్తావిస్తోంది.
పౌలా హర్డ్, ఒరాకిల్ మాజీ సీఈఓ మార్క్ హర్డ్ భార్య. 2019లో భర్త మరణించిన తర్వాత, ఆమె బిల్ గేట్స్‌కు దగ్గరయ్యారు. గత కొంతకాలంగా వీరిద్దరూ వివిధ అంతర్జాతీయ ఈవెంట్లలో కలిసి కనిపిస్తున్నారు. గేట్స్, తన గత భార్య మిలిండా ఫ్రెంచ్ 2021లో విడాకులు తీసుకున్నారు.
బిల్ గేట్స్, పౌలా హర్డ్ కలిసి పర్యటనలు, ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటూ తమ బంధాన్ని మరింత బలపరుచుకుంటున్నారు. గేట్స్ తన ప్రేయసి గురించి బహిరంగంగా మాట్లాడటంతో, ఈ జంటపై మరింత ఆసక్తి పెరిగింది.

 
				 
				
			 
				
			 
				
			