వరల్డ్ క్రికెట్ కనెక్ట్స్‌లో జై షాకు కీలక స్థానం!

ICC Chairman Jai Shah joins WCC advisory panel set up by MCC to discuss cricket’s future and challenges. ICC Chairman Jai Shah joins WCC advisory panel set up by MCC to discuss cricket’s future and challenges.

వరల్డ్ క్రికెట్ కనెక్ట్స్ (డబ్ల్యూసీసీ) సలహా మండలిలో ఐసీసీ ఛైర్మన్ జై షాకు చోటు కల్పించడం క్రికెట్ ప్రపంచంలో ఆసక్తికర పరిణామంగా మారింది. ఈ స్వతంత్ర బోర్డును మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ఏర్పాటు చేసింది. క్రికెట్ అభివృద్ధి, అవకాశాలు, భవిష్యత్ సవాళ్లు వంటి అంశాలపై చర్చించేందుకు ఈ మండలి కార్యాచరణ రూపొందించనుంది.

ఈ సమావేశం జూన్ 7, 8 తేదీల్లో లార్డ్స్‌లో నిర్వహించనున్నారు. ఈ సదస్సులో ప్రస్తుత జాతీయ జట్ల కెప్టెన్లు, మాజీ క్రికెటర్లు, ప్రసార సంస్థల ప్రతినిధులు, ఇతర క్రికెట్ నిపుణులు పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ మార్గదర్శకత్వంపై ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

డబ్ల్యూసీసీ ద్వారా క్రికెట్ అభివృద్ధికి సంబంధించి కీలక మార్పులపై చర్చించనున్నారు. ముఖ్యంగా ఐసీసీకి చెందిన పాలకులు, ఎంసీసీ అధికారులతో పాటు వివిధ దేశాల క్రికెట్ బోర్డుల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు. కొత్త ఫార్మాట్లు, లీగ్ పోటీలు, ఆటగాళ్ల భవిష్యత్ అంశాలు ప్రధాన చర్చలుగా మారే అవకాశం ఉంది.

క్రికెట్ అభివృద్ధికి సంబంధించి డబ్ల్యూసీసీ తీసుకునే నిర్ణయాలు భవిష్యత్ లో ప్రపంచ క్రికెట్ పై గణనీయమైన ప్రభావం చూపే అవకాశముంది. ఈ కొత్త బోర్డులో ఐసీసీ ఛైర్మన్ జై షా స్థానం పొందడం, భారత్ క్రికెట్ పట్ల అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక శ్రద్ధ వహించబడుతోందని స్పష్టమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *