రాష్ట్రంలో అటవీశాఖలో సమగ్ర మార్పులు తీసుకురావాలని డిప్యూటీ సీఎం దృష్టి సారించారు. ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యలను సమర్థంగా పరిష్కరించేందుకు, శాఖ పనితీరును మెరుగుపరచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు, వివిధ విభాగాల్లో మార్పులు చేయాలని నిర్ణయించారు.
దశాబ్దాలుగా అటవీశాఖలో కొనసాగుతున్న సమస్యలను గుర్తించి, వీటి పరిష్కారానికి సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పి.సి.సి.ఎఫ్, హెచ్.ఓ.ఎఫ్.ఎఫ్.లకు నివేదిక తయారీకి గడువు విధించారు. త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
గత కొన్నేళ్లుగా అటవీశాఖ పరంగా సరైన ప్రగతిని సాధించలేకపోయిందని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు. అందుకు కారణాలు విశ్లేషించి, వ్యూహాత్మక మార్పులు తీసుకురావాలని సూచించారు. దీని కోసం విభాగాల వారీగా సమీక్షలు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.
అటవీ పరిరక్షణ, అభివృద్ధి కోసం ప్రభుత్వ లక్ష్యాలను అమలు చేయడంలో కార్యాచరణ వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం తెలిపారు. అటవీ సంరక్షణను మరింత బలోపేతం చేయడం, సంస్కరణలు అమలు చేయడం లక్ష్యంగా చర్యలు కొనసాగనున్నాయి.
