SIM కార్డ్ యాక్టివేషన్‌పై TRAI కీలక మార్పులు తీసుకువచ్చింది. ఇప్పటి వరకు వినియోగదారులు ప్రతి నెలా కనీస రీఛార్జ్ చేయకపోతే, వారి SIM కార్డ్ డీయాక్టివేట్ అవుతూ ఉండేది. అయితే, తాజా మార్పులతో 90 రోజుల పాటు కనీసం రూ. 20 బ్యాలెన్స్ ఉంటే SIM యాక్టివ్‌గా కొనసాగుతుంది. ఈ పథకం అన్ని టెలికాం ఆపరేటర్లకు వర్తిస్తుంది.
జియో, ఎయిర్‌టెల్, Vi తమ వెబ్‌సైట్లలో కూడా ఈ మార్పును స్పష్టంగా పేర్కొన్నాయి. ఎయిర్‌టెల్ షరతుల ప్రకారం, 90 రోజుల పాటు ఏదైనా సేవను ఉపయోగించకపోతే, కనీస బ్యాలెన్స్ రూ. 20 లేకుంటే, సర్వీస్ డీయాక్టివేట్ అవుతుంది. అయితే, ఈ మార్పులతో వినియోగదారులు ప్రతీ నెల రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు.
కనీస బ్యాలెన్స్ ద్వారా SIM యాక్టివ్‌గా కొనసాగుతుందే తప్ప, కాల్స్, SMS, డేటా సేవలపై ఎటువంటి హామీ ఉండదు. టెలికాం ఆపరేటర్లు అవుట్‌గోయింగ్ కాల్స్, SMS, మరియు OTP సేవలను నిలిపివేయవచ్చు. కానీ కనీసం 20 రూపాయలు ఖాతాలో ఉంటే, నెంబర్ డీయాక్టివేషన్ కాకుండా 90 రోజుల పాటు కొనసాగుతుంది.
ఈ కొత్త విధానం వినియోగదారులకు ప్రయోజనకరం కానీ, తక్కువ ఖర్చుతో SIM యాక్టివ్‌గా ఉంచుకునే వారు పూర్తిగా సేవలు పొందలేరు. ఖాతాలో బ్యాలెన్స్ లేకుంటే 15 రోజుల గ్రేస్ పీరియడ్ ఇస్తారు. కానీ ఆ సమయంలో కూడా రీఛార్జ్ చేయకపోతే, SIM డీయాక్టివేట్ అవుతుంది.