చిత్తూరు జిల్లాలో స్టైఫండరీ కేడెట్ ట్రైనీ కానిస్టేబుళ్ల ఎంపిక పరీక్షలు 9వ రోజుకూడా క్రమశిక్షణగా కొనసాగాయి. ఇంచార్జ్ ఎస్పీ శ్రీమతి వి. రత్న ఐపీఎస్ గారి పర్యవేక్షణలో అధికారులు పరీక్షల నిర్వహణలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటివరకు అత్యధికంగా 750 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు.
కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియలో అభ్యర్థుల ఫిజికల్ మెజర్మెంట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు నిర్దిష్ట నిబంధనల ప్రకారం నిర్వహించారు. పురుష అభ్యర్థులకు ఎత్తు, ఛాతీ కొలిచారు, మహిళా అభ్యర్థులకు ఎత్తు, బరువు కొలిచారు. అనంతరం 1600 మీటర్ల పరుగు, 100 మీటర్ల స్ప్రింట్, లాంగ్ జంప్ పరీక్షలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు(APSLRB) మార్గదర్శకాలను అనుసరించి పరీక్షలు పూర్తిగా పారదర్శకంగా నిర్వహించారని అధికారుల తెలిపారు. అభ్యర్థుల బయోమెట్రిక్ అథెంటికేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, RFID ట్యాగ్‌ల పంపిణీ సజావుగా సాగాయి.
అభ్యర్థులు, తల్లిదండ్రులు దళారులను నమ్మొద్దని, ఎవరైనా నకిలీ రిక్రూట్మెంట్ అంటూ మోసపూరిత వాగ్దానాలు చేస్తే వెంటనే డయల్ 100 లేదా పోలీస్ వాట్సాప్ నెం. 9440900005 కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
