ముంబై బాంద్రాలోని సైఫ్ అలీ ఖాన్ నివాసంలో జరిగిన కత్తితో దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఈ సంఘటనపై సైఫ్ భార్య కరీనా కపూర్ ఇప్పటికే బాంద్రా పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ, దుండగుడు ఎంతో ఆవేశంగా ఉన్నాడు అని తెలిపారు.
కరీనా కపూర్ ప్రకారం, సైఫ్ ను దుండగుడు ఆరు సార్లు కత్తితో పొడిచాడని, అయితే ఇంట్లో ఉన్న వస్తువులను దొంగిలించలేదని వెల్లడించారు. సైఫ్ మరియు కుటుంబ సభ్యులు దుండగుడితో పోరాడిన సమయంలో, సైఫ్ తన చిన్న కుమారుడు జేహ్, కేర్ టేకర్ ను కాపాడే ప్రయత్నంలో దాడికి గురయ్యాడని చెప్పారు.
ఈ దాడి తర్వాత కరీనా కపూర్ ఎంతో భయంతో ఉన్నారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం, తను ఏమి చేయాలో అర్థం కాకపోయింది, కానీ వెంటనే ఆమె అక్క కరిష్మా కపూర్ వచ్చి తనకు ధైర్యం ఇచ్చారని తెలిపారు. ఆమె అక్కను తీసుకుని ఆమె ఇంటికి వెళ్లిపోయింది.
ఇక, పోలీసులు 20 బృందాలుగా దుండగుడిని పట్టుకునేందుకు గాలింపు నిర్వహిస్తున్నారు. సైఫ్ ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, ఐసీయూలో నుంచి ప్రత్యేక గదికి మార్చారు.