పంటలు ఇంటికి చేరిన తరువాత జరువుకునే పండుగ సంక్రాంతి. ఆ సంతోషంతో కూతురును, అల్లుడిని ఇంటికి ఆహ్వానించే ఆనవాయితి. బంధు మిత్రులతో సరదాగా గడిపే సంప్రదాయం తెలుగు రాష్ట్రాల్లో తరతరాలుగా కనిపిస్తూ వస్తోంది. ఈ కాలంలో పండుగ సంతోషం తో పాటు కొత్త సినిమాలు థియేటర్లలో సందడి చేయడం కూడా ఆచారంగా మారింది.
ఈ సారి సంక్రాంతి బరిలో మూడు భారీ సినిమాలు సందడి చేయబోతున్నాయి. మొదటగా, బాలకృష్ణ కథానాయకుడిగా ‘డాకు మహారాజ్’ భారీ యాక్షన్‌తో ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రం కోసం మాస్ ఆడియన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
అలాగే, వెంకటేశ్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులకు అందించబోతున్నారు. ఈ సినిమాలో కామెడీ టచ్‌తో కుటుంబ కథనం సాగిపోవడం, ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం ఖాయం.
చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందించిన ‘గేమ్ ఛేంజర్’ కూడా ఈ సంక్రాంతి బరిలో నిలవనుంది. ఈ సినిమాకు కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మొత్తం మూడు సినిమాల విడుదలతో ఈ సంక్రాంతి సినిమాల ప్రపంచంలో భారీ పోటీ కనిపిస్తోంది.