మన భారతీయ వంటకాల రుచికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కానీ కొన్ని దేశాల్లో మన ఆహార పదార్థాలపై నిషేధాలు అమల్లో ఉన్నాయి. ఈ నిషేధాలకు కారణాలు వారికే ప్రత్యేకం.
సమోసా – సోమాలియా: ముక్కోణపు ఆకారంలో ఉండే సమోసాలను సోమాలియాలో నిషేధించారు. దీనికి కారణం ఆ ఆకృతిని క్రైస్తవ చిహ్నంగా భావించడం. అల షబాబ్ గ్రూపు దీనిని వ్యతిరేకిస్తూ చర్యలు తీసుకుంది.
మసాలా పొడులు – సింగపూర్, హాంకాంగ్: భారతీయ మసాలాలపై సింగపూర్, హాంకాంగ్ లలో నిషేధం ఉంది. వీటిలో ఉన్న ఇథైలీన్ ఆక్సైడ్ అనే రసాయనాన్ని కేన్సర్ కారకంగా పరిగణిస్తున్నారు. ఈ కారణంగా పెద్ద కంపెనీల మసాలాలు అక్కడ అందుబాటులో లేవు.
గసగసాలు – తైవాన్, సింగపూర్, యూఏఈ: భారతీయ వంటల్లో ముఖ్యమైన గసగసాలను కొన్ని దేశాల్లో నిషేధించారు. మార్ఫిన్ మాదకద్రవ్యం ఉన్నట్లు భావిస్తూ ఈ నిషేధాలు అమలు చేస్తున్నారు.
ఈ నిషేధాల వెనుక ఆరోగ్యపరమైన, సాంస్కృతిక కారణాలున్నాయి. అయితే ప్రపంచంలోని చాలా మంది భారతీయ వంటకాలను ఇష్టపడుతూనే ఉన్నారు.
