ఏపీలోని బాపట్ల జిల్లా కొత్తపాలెం గ్రామంలో ఓ దారుణం చోటుచేసుకుంది. భర్త తన భార్యను హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గోకర్ణమఠంకు చెందిన అమరేంద్రబాబు, కొత్తపాలెంకు చెందిన అరుణ వివాహం చేసుకున్న 10 సంవత్సరాలు కావొచ్చింది. కానీ, నాలుగేళ్ల క్రితం మద్యానికి బానిసైన అమరేంద్రబాబుతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి.
ఈ గొడవల కారణంగా అరుణ తన భర్తను వదిలి స్వగ్రామంలో ఉంటోంది. దీంతో అమరేంద్రబాబు ఆమెతో మళ్లీ గొడవకు దిగాడు. ఈ గొడవలో అమరేంద్రబాబు తన భార్యను కొట్టాడు. దీంతో ఆగ్రహించిన అరుణ తన భర్తపై దాడి చేసింది.
అరుణ తన భర్త గొంతుకు తాడు వేసి లాగి చంపేసింది. ఈ ఘటన జరిగిన తరువాత, అతనిపై ఆమె కుటుంబ సభ్యులు దాడి చేసినట్లు సమాచారం. నలుగురు వ్యక్తులు ఇందులో జోక్యం చేసుకుని అరుణ భర్తను చంపిన విషయం వెల్లడైంది.